మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (23:29 IST)

రుతుపవనాల రాక.. జాలర్ల చేతికి చిక్కిన ఎర్ర చందనం చేప!

రుతుపవనాల రాకతో తెలంగాణలో వర్షాలు పడడంతో.. ఓ 'ఎర్ర చందనం' రకపు చేప బయటకొచ్చి.. జాలర్ల చేతికి చిక్కింది. బుధవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో.. చేపల వేటకు వెళ్లిన వీరగాని రమేష్‌కు 12 కేజీల బరువున్న ఎరుపు రంగులో కనిపించే అరుదైన 'ఎర్ర చందనం' రకం చేప లభ్యమైంది. ఆ చేపను చూసిన అతను ఎంతో ఆశ్చర్యానికి గురై.. ఆ జిల్లా మత్స్యశాఖకు సమాచారాన్నందించారు. 
 
దీనిపై ఆ జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య మాట్లాడుతూ... ఈ ఎర్రచందనం రకపు చేపలు తెలంగాణ ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయని అన్నారు. దీని శాస్త్రీయ నామం హైపోప్తాలమిటిస్‌ అని తెలిపారు.
 
ఒక్క చేపలే కాదు.. రంగు రంగుల కప్పలు నీటిలో తేలియాడుతున్నాయి. బుధవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో.. భారీ వర్షం కురవడంతో... ఖిల్లా వరంగల్‌ కోట పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిలో పసుపుపచ్చ రంగు కప్పలు కనిపించాయి. ఇలాంటి రంగు కప్పలని ఎప్పుడూ చూడని స్థానికులు.. వాటినెంతో ఆసక్తిగా చూస్తున్నారు.