బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:42 IST)

నల్లమల అడవిలో అరుదైన పాము

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం రేంజ్‌ పరిధిలోని నల్లమల అడవిలో అరుదైన పాము ప్రత్యక్షమైంది. గుండం పరిసరాల్లో కనిపించిన ఈ పామును దక్షిణ భారతదేశంలో 'షీల్డ్‌ టైల్‌ స్నేక్‌'గా పిలుస్తారని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు.

నల్లమల అడవులు. ఎన్నో జీవజాతులకు ఆలవాలం. మరెన్నో వన్యప్రాణులకు ఆవాసంగా నల్లమల అడవులు ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని ఇంకెన్నో ప్రాణులకు ఆవాసంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతం.. గుండం పరిసరాల్లో ఈ షీల్డ్‌ టైల్‌ స్నేక్‌ జాతికి చెందిన పాము అటవీశాఖ అధికారుల కంటపడింది.

యూరో ఫెల్డీటే కుటుంబానికి చెందిన యూరోఫెల్డ్సీ ఎల్‌ఎటి దీని శాస్త్రీయనామం అన్ని చెప్పారు. ఈ జాతి పాము నల్లమలలో ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చన్నారు. షీల్డ్‌టెయిల్స్‌ హానిచేయనివి, ప్రాచీనమైనవి అని చెప్పారు.

ఇవి 25-50 సెం.మీ పొడవు వరకు పెరుగుతాయని, పాములు తమ సొంత సొరంగాలను తవ్వి భూగర్భంలో నివసిస్తాయని అన్నారు. ఇవి భూమిలో సొరంగాలు తవ్వుకొని నివశిస్తాయని, ఆహారం కోసం రాత్రి సమయంలో మాత్రమే బయటకు వస్తాయని తెలిపారు.