ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జులై 2021 (14:59 IST)

ఫ్యాన్సీ నెంబర్లు.. ఆర్టీఏకు ఒక్కరోజే రూ. 29.14 లక్షల ఆదాయం

ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులకు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు.. వాటిపై మక్కువతో లక్షలు వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏలో టీఎస్‌ 09 ఎఫ్‌ఎస్‌ సిరీస్‌ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఫ్యాన్సీ నంబర్ల వేలం పాట ద్వారా ఒక్కరోజే రూ. 29.14 లక్షల ఆదాయాన్ని ఆర్టీఏ తమ ఖజానాలో సమకూర్చుకుంది.
 
టీఎస్‌09ఎఫ్‌ఆర్‌ 9999 నంబరు రూ.7.60 లక్షలు పలుకగా, కొత్తగా ప్రారంభమైన సిరీస్‌లో టీఎస్‌09ఎఫ్‌ఎస్‌0009 నంబర్‌ 6.50 లక్షలకు ఓ వాహనదారుడు దక్కించుకున్నాడు. అదే సిరీస్‌లో 0111 నంబర్‌ను 1.20 లక్షలకు మరో వాహనదారుడు కైవసం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో ఈ నంబర్లు ధర పలుకగా, మిగిలిన నంబర్లు కలిపి మొత్తం సిరీస్‌ తొలి రోజున రూ. 29.14 లక్షల ఆదాయం వచ్చినట్లు ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు తెలిపారు.