మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (21:52 IST)

విజ్ఞాన గనులు పుస్తకాలు : డిఐజి రంగనాధ్

పుస్తకాలు విజ్ఞాన గనులని ప్రతి పుస్తకం మనిషి జీవితంలో ఎక్కడో ఒక చోట ప్రభావితం చేస్తుందని నల్లగొండ డిఐజి ఏ.వి..రంగనాధ్ అన్నారు.
 
శనివారం క్యాంపు కార్యాలయంలో జనరల్ స్టడీస్ - 1 పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో నియామక పరీక్షలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

ఎన్నో రకాల పుస్తకాలను ముద్రించి నిరుద్యోగులకు ఉద్యోగ సాధనలో అనేక విజయాలు అందించిన తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఈ పుస్తకం ముద్రించడం సంతోషంగా ఉన్నదని, అదే సమయంలో జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదే సత్యనారాయణ భాగస్వామ్యం వహించడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ సందర్బంగా సత్యనారాయణను ఆయన శాలువాలతో సత్కరించారు.
 
పుస్తక రచనలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆదె సత్యనారాయణ పాలు పంచుకోవడం విశేషం. ఈయన ప్రస్తుతం అనుముల మండలం మర్లగడ్డ గూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
 
కార్యక్రమంలో రాష్ట్రోపాద్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి గణపురం భీమయ్య, కందిమల్ల నరేందర్ రెడ్డి, పుస్తక రచయిత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.