శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:39 IST)

ఆ బ్యాంకు చెక్కు బుక్కులు ఇక చెల్లవు...

ఇటీవల జాతీయకరణ పేరుతో కొన్ని బ్యాంకులను మరికొన్ని బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇలాంటి బ్యాంకుల్లో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. ఈ బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్స్ అక్టోబర్ నెల నుంచి చెల్లుబాటు కావు. 
 
అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు చెక్కు రూపేణా ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం కుదరదు. ఈ రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. అందువల్ల ఇకపై పీఎన్బీ బ్యాంకు చెక్కులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. 
 
అలాగే అలహాబాద్ బ్యాంక్ పాత చెక్ బుక్స్ కూడా పని చేయవు. ఈ బ్యాంక్ కూడా పీఎన్‌బీలో విలీనమైంది. అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఆయా బ్యాంకు ఉన్నతాధికారులు వెల్లడించారు.