సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:40 IST)

ఐఐటి మద్రాస్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఆన్‌లైన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ తదుపరి బ్యాచ్ ఆన్‌లైన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది, ఇది ప్రప్రధమంగా 2020లో ప్రారంభించబడింది. ఇది ఒక విప్లవాత్మక యోచన, ఈ ప్రోగ్రామ్ కాబోయే విద్యార్థుల యొక్క భౌగోళిక స్థానం, విద్యా నేపథ్యం మరియు వృత్తితో సంబంధం లేకుండా XII క్లాస్ పూర్తి చేసి, పదోతరగతిలో ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ చదివిన ప్రతి ఒక్కరి నుండి ఒక డేటా సైంటిస్ట్‌ని తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి క్వాలిఫయర్ బ్యాచ్ కోసం క్లాసులు సెప్టెంబర్ 2021లో ప్రారంభమవుతాయి.
 
ఫౌండేషన్ స్థాయికి 27 రాష్ట్రాలు మరియు ఐదు కేంద్రపాలిత ప్రాంతాల నుండి విద్యార్థులు, బ్యాంకర్లు, ఇంజనీర్లు, పరిశోధకులు, నిర్వాహకులు, ఉపాధ్యాయులు మరియు సీఈవోల వరకు పాల్గొనేవారిని ఆకర్షించడం వలన ఈ కార్యక్రమం యొక్క విజయపథాన్ని ఇతరులు అంచనా వేయవచ్చు.
 
ఈ ప్రోగ్రామ్ ద్వారా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) పరీక్ష వ్రాయకుండానే IIT మద్రాస్ నుండి చదువుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. విద్యార్థులు తమ ఆన్-క్యాంపస్ కోర్సులతో పాటు డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ & డేటా సైన్స్‌ను అభ్యసించవచ్చు. ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ యొక్క తదుపరి బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 ఆగస్టు 2021. ఆసక్తి ఉన్న విద్యార్థులు onlinedegree.iitm.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్, ప్రొఫెసర్ ఇన్‌ఛార్జ్, డేటా సైన్స్ ప్రోగ్రాం, ఐఐటి మద్రాస్, వారు ఈ కార్యక్రమం యొక్క విశిష్ట అంశాల గురించి ప్రముఖంగా ప్రకటిస్తూ, “ఐఐటి మద్రాస్ నుండి ఈ డిప్లొమా ద్వారా ప్రోగ్రామింగ్ మరియు డేటా సైన్స్‌లో కెరీర్‌ను నిర్మించవచ్చు అని అభిప్రాయపడ్డారు. మొదటి బ్యాచ్ ఆగస్టు 2021 లో ఫౌండేషన్ స్థాయిని పూర్తి చేస్తోంది మరియు దాని యొక్క కాన్వొకేషన్  ప్లాన్ చేయబడింది”.
 
ఇంకా, ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ, “ IIT మద్రాస్ ఈ ప్రోగ్రామ్‌ యొక్క ప్రక్రియలో ప్రమాణాలకు రాజీ పడకుండా, అత్యధిక సంఖ్యలో అభ్యాసకులకు అత్యున్నత నాణ్యమైన అభ్యాస అవకాశాన్ని అందిస్తోంది.  ఆన్‌లైన్ తరగతులు మరియు వ్యక్తిగతంగా ఇన్విజిలేటెడ్ పరీక్షల కలయిక దీనిని సాధిస్తుంది.  ప్రతి దశలో, విద్యార్థులు ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించడానికి మరియు IIT మద్రాస్ నుండి సర్టిఫికేట్, డిప్లొమా లేదా డిగ్రీని స్వీకరించడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు.
 
IIT మద్రాస్ డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ మరియు డేటా సైన్స్‌లో ఒక ప్రత్యేకమైన మోడల్ లెర్నింగ్‌ని అందిస్తుంది, ఇది ఆన్‌లైన్ కోర్సు డెలివరీని వ్యక్తిగతంగా మూల్యాంకనం చేయడం ద్వారా ప్రపంచంలోనే ఇది ప్రప్రధమంగా రూపింపబడింది కార్యక్రమము. ఇది మాత్రమే కాక ఆర్థికంగా బలహీనమైన నేపథ్యాల విద్యార్థులకు చేయూత నివ్వడానికి ఐఐటి మద్రాస్ కోర్సు ఫీజులో 75% వరకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.
 
మరియు, ఐఐటి మద్రాస్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ప్రొఫెసర్ ఇన్-ఛార్జ్ డాక్టర్ విఘ్నేష్ ముత్తువిజయన్ మాట్లాడుతూ, "అనేక వాస్తవ-ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో డేటా సైన్స్ ఒక ప్రభావవంతమైన సాధనంగా మారుతోంది మరియు వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పరిశ్రమలలో మరింతగా స్వీకరించబడుతోంది.  ప్రోగ్రామింగ్ మరియు డేటా సైన్స్‌లో స్పెషలైజేషన్‌లు ఎంపిక చేయబడ్డాయి, వీటిని పూర్తిగా ఆన్‌లైన్‌లో బోధించడానికి, మరియు హాండ్స్-ఆన్ ప్రాక్టీసింగ్ కు అనువుగా ఉంటుంది”.
 
అర్హత ప్రక్రియను క్లియర్ చేసిన తర్వాత మొత్తం 7,116 మంది అభ్యాసకులు ఫౌండేషన్ స్థాయి మొదటి బ్యాచ్‌లో చేరారు.  రెగ్యులర్ ఎంట్రీ ద్వారా విద్యార్థులు ఫౌండేషన్ స్థాయిని పూర్తి చేసిన తర్వాత డిప్లొమా స్థాయిలో చేరవచ్చు. డిప్లొమా స్థాయిలో, విద్యార్థులు ప్రోగ్రామింగ్‌లో డిప్లొమా లేదా డేటా సైన్స్‌లో డిప్లొమా లేదా రెండూ చేయవచ్చు.
 
ఈ డేటా సైన్స్ ప్రోగ్రామ్ తీసుకోవడంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన విద్యార్థి శ్రీ అమన్ తివారీ, “ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తెచ్చినందుకు మద్రాస్ IITకి ధన్యవాదాలు. ఇది మామూలు ప్రోగ్రామ్ మాత్రమే కాదు, నాలాంటి చాలా మంది విద్యార్థులకు ఇది ఆశా కిరణం. మేము భారతదేశంలోని ఉత్తమ అధ్యాపకులు మరియు ప్రొఫెసర్ల నుండి ఉత్తమంగా నేర్చుకునే అవకాశాన్ని పొందుతున్నాము. ఈ కార్యక్రమం మరియు ప్రతి కార్యాచరణ యొక్క నిర్మాణం చాలా సులభమైనది. ఈ కార్యక్రమంలో ఉత్తేజకరమైన మరియు ప్రత్యేకమైనదిగా ఉండే విద్యార్ధి గృహాలు, క్లబ్బులు మొదలైనవి చాలా ఉన్నాయి."
 
 
ఫౌండేషన్ స్థాయిలో లెర్నర్ మరియు మల్టీనేషనల్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ శ్రీ ధీరజ్ కుమార్ మాట్లాడుతూ, “నేను ఆన్‌లైన్‌లో కనుగొనగలిగే ఉత్తమ ప్రోగ్రామ్‌లలో ఇది ఒకటి. పరిశ్రమ అవసరాల ప్రకారం ప్రోగ్రామ్ యొక్క నిర్మాణం చాలా సందర్భోచితంగా ఉంటుంది మరియు కంటెంట్ యొక్క నాణ్యత IIT ఆన్-క్యాంపస్ ప్రోగ్రామ్ వలె బాగుంది. కంటెంట్ యొక్క నాణ్యతను బట్టి ఇది అందుబాటులో ఉండే చౌకైన ప్రోగ్రామ్ కూడా."
 
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా, దరఖాస్తుదారులందరూ క్వాలిఫైయర్ ప్రక్రియ ద్వారా వెళతారు, ఇందులో ఐఐటి మద్రాస్ వీడియో ఉపన్యాసాలు, అసైన్‌మెంట్లు మరియు కోర్సు బోధకులతో ప్రత్యక్ష పరస్పర ప్రతిస్పందనల ద్వారా నాలుగు వారాల ఆన్‌లైన్ శిక్షణను అందిస్తుంది. ఆన్‌లైన్ అసైన్‌మెంట్‌లు పూర్తయిన తర్వాత, విద్యార్థులు క్వాలిఫయర్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యాసకులకు ఫౌండేషన్ స్థాయికి ప్రవేశం లభిస్తుంది.