సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (19:44 IST)

కిడ్నాప్ కథకు ఎండ్ కార్డ్.. ఇష్టపూర్వకంగానే జానీతో పెళ్లి

Siricilla Shalini
Siricilla Shalini
రాజన్న సిరిసిల్లలో యువతి కిడ్నాప్ కథకు ఎండ్ కార్డు పడింది.  తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. తన ప్రేమికుడిని వివాహం చేసుకున్నానని ఓ వీడియో రీలిజ్ చేసింది. తనను కిడ్నాప్  చేసిన వ్యక్తి.. తనను ప్రేమించిన వ్యక్తి మాస్క్ ధరించడం వల్ల గుర్తుపట్టలేకపోయానని చెప్పింది. 
 
ఇందులో ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. యువకుడితో కలిసి వున్న పెళ్లి ఫోటోలు రిలీజ్ చేసింది శాలిని. యువతి పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని.. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లిపోయినట్లు క్లారిటీ ఇచ్చింది. అతనిని వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది.
 
చందుర్తి మండలం మూడపల్లికి చెందిన యువతి.. ఉదయం తండ్రితో కలిసి ఆలయానికి వెళ్లింది. ఆలయంలో పూజచేసి బయటకు వస్తుండగా కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.