గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (16:10 IST)

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. అతివేగం కారణంగా జరిగే ప్రమాదాలు ఓవైపు జరుగుతుంటే.. అదుపు తప్పి వాహనాలు ఢీకొనడం ద్వారా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పెద్ద కొడప్‌గల్‌ జగన్నాధపురం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిచ్కుంద నుంచి పిట్లంవైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
జగన్నాథపురంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని క్వాలిస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.