మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:12 IST)

గురుపూజోత్సవం, పూజలందుకోవాల్సిన గురువు బైక్ మెకానిక్‌గా...

ఉన్నత చదువులు చదివిన ఆ ఉపాధ్యాయుడు గురు పూజోత్సవం రోజున గురువు గౌరవాన్ని అందుకోవాలి కానీ కరోనా పుణ్యాన ఉపాధి కోల్పోయిన గురువు, కుటుంబ పోషణ కోసం బైక్ మెకానిక్‌గా మారాల్సిన దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది.
 
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన  రవీందర్ ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాదులో ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ప్రతి ఏడాది గురుపూజోత్సవం రోజున విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాలలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించేవారు. ఉపాధ్యాయుడుగా ఆరోజున పొందే తృప్తి జీవితంలో మరుపురాని జ్ఞాపకంలా ఉండేది.
 
ఇప్పుడు కరోనా పుణ్యాన కళాశాలలు మూతపడి ఉపాధి కోల్పోయి, కుటుంబ పోషణ కోసం ఆత్మాభిమానాన్ని పక్కనపెట్టిన ఆ గురువు బైక్ మెకానిక్ మారాడు. గురుపూజోత్సవం రోజున ఉపాధ్యాయుని ఈవిధంగా చూడాల్సి రావడం విద్యార్థులు వారి తల్లిదండ్రులను కలచివేస్తోంది. కరోనా మహమ్మారి తొలగిపోయి మరలా తిరిగి మంచి రోజులు రావాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.