బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated: గురువారం, 18 నవంబరు 2021 (13:07 IST)

దొడ్డి కొమురయ్య విగ్రహానికి ఉరేసుకున్న న్యాయవాది

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో ఓ న్యాయవాది ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పట్టణంలోని విజయపురి కాలనీలో ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి మేకల రాజేశ్వర్‌ అనే న్యాయవాది ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
 
ఈ విషయాన్ని గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అనారోగ్యం, ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.
 
అయితే, న్యాయవాది ఇలా బలవన్మరణానికి పాల్పడటం వెనుక ఏదేని ఆర్థిక సమయ్యలు లేదా కేసుల ఒత్తిడి, బెదిరింపులు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.