శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 18 నవంబరు 2023 (22:06 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: తాజాగా పట్టుబడ్డ డబ్బు రూ. 6.5 కోట్లు, మొత్తం రూ. 570 కోట్లు

cash seized
తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో డబ్బు, మద్యం, బంగారం బహుమతులను ఓటర్లకు ఎరగా వేస్తున్నారు రాజకీయ నాయకులు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రూ. 6.5 కోట్లు పట్టుబడినట్లు సమాచారం.
 
హైదరాబాద్ నుంచి 6 కార్లలో ఖమ్మం జిల్లాకు తరలిస్తుండగా పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న డబ్బుకి సరైన లెక్కలు లేకపోవడంతో డబ్బు, కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేసారు. ఇదిలావుంటే ఇప్పటివరకూ తెలంగాణలో రూ. 570 కోట్లు పట్టుబడింది. పోలీసులకు దొరికిన డబ్బు ఇన్ని కోట్లు వుంటే వారికి దొరకకుండా దొడ్డిదోవన తరలిస్తున్న డబ్బు వేల కోట్లలో వుంటుందని అంటున్నారు.