శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (22:01 IST)

హుజురాబాద్ నుంచి ముగ్గురు మంత్రుల పోరు...!

huzurabad bypoll
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా హుజురాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. వీరిలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్‌గా పని చేసిన పొల్సాని నర్సింగరావు, కర్షక పరిషత్ చైర్మన్ దుగ్గిరాల వెంకట్రావ్, రెండుసార్లు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా ఈటల రాజేందర్‌లు బరిలో ఉన్నారు. 
 
హుజూరాబాద్ నియోజకవర్గం ఏర్పడిన ప్పటి నుంచి ఇప్పటి వరకు ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే‌గా ఉన్న ఇనుగాల పెద్దిరెడ్డి 1994-2004 వరకు రాష్ట్ర చక్కర, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు బీసీ శాఖ మంత్రిగా ఆరు నెలల పాటు కొనసాగారు. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన జరిగింది. 
 
కమలాపూర్ నియోజకవర్గంలోని మూడు మండలాలు కలుపుకొని హుజూరాబాద్ నియోజకవర్గంగా ఏర్పడింది. అంతకు ముందు ముద్దసాని దామోదర్ రెడ్డి కమలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మంత్రి పదవి చేశారు. 2014లో మొట్ట మొదటి సారిగా హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ, 2018లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు. 
 
1967లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పొల్సాని నర్సింగరావు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసి, హుజూరాబాద్ డిపోను నెలకొల్పారు. 1986లో ఎమ్మెల్యేగా గెలిచిన దుగ్గిరాల వెంకట్రావ్ రాష్ట్ర కర్షక పరిషత్ చైర్మన్ పనిచేశారు. అంతేకాకుండా 2008-09 సంవత్సరంలో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు.