బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (22:23 IST)

తెలంగాణలో పది రోజుల పాటు లాక్‌డౌన్.. సాయంత్రం 6 గంటల నుంచి..?

తెలంగాణలో మరో పది రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలను సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ లాక్ డౌన్ కొనసాగనుంది. 
 
రాష్ట్రంలో కర్ఫ్యూను పక్కాగా అమలు చేయనుంది. మంగళవారం (జూన్ 8)న కేబినెట్ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓ గంట పాటు ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. ఎల్లుండి నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
 
ఖమ్మం, మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించగా.. నకిరేకల్ మినహా నల్గొండ జిల్లా మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.  కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లిలో లాక్ డౌన్ కొనసాగనుంది. ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులు వర్తిస్తాయి. 
 
అలాగే నకిరేకల్ మినహా నల్లగొండ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు అమల్లో ఉంటాయి. ఈ నెల 10 నుంచి లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి రానున్నాయి. తెలంగాణలో మే 12 నుంచి 20 గంటల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.