ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (09:44 IST)

తెలంగాణలో భానుడి భగభగ.. 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

Summer
భానుడి ప్రతాపంతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ అత్యధికంగా పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్​కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
రాష్ట్రంలో భానుడి భగభగలు ఇంకా తగ్గడం లేదు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. 
 
అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా సూర్యాపేట, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి , మంచిర్యాల, కుమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.