నిర్మల్ దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం

nirmal durgamata
ఎం| Last Updated: బుధవారం, 9 అక్టోబరు 2019 (11:49 IST)
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జోనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు చెరువులో గల్లంతయ్యారు.

ఒకరు క్షేమంగా బయటపడినా... మరొకరి ఆచూకీ లభించలేదు. దసరా పర్వదినాన నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడకు చెందిన ఇద్దరు యువకులు స్థానిక వినాయక సాగర్ చెరువులో దిగి గల్లంతయ్యారు.

గమనించిన స్థానికులు ఒకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో యువకుడు అనిల్ వర్మ(20) చెరువులో మునిగి పోయాడు. స్థానికులు ఎంత వెతికినా దొరకలేదు. స్థానికుల పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

పండగపూట చెరువులో యువకుడు గల్లంతు కావడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు వినాయక సాగర్ వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.దీనిపై మరింత చదవండి :