శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:09 IST)

తెలంగాణలో కరోనా పరిస్థితి ఇదీ: హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక

తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో చేపడుతున్న కొవిడ్‌ పరీక్షల వివరాలను, కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలు, ఇతర అంశాలను ప్రభుత్వం ఇందులో పేర్కొంది.
 
నివేదికలోని ముఖ్యాంశాలు..
ఈ నెల 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో మొత్తం 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించాం. వీటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్‌, 19.16లక్షల ర్యాపిడ్‌ పరీక్షలు ఉన్నాయి. కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నాం. ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 3.5 శాతం.కరోనాపై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి.

కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మద్యం దుకాణాలు, పబ్‌లు నిబంధనలు పాటించేలా చర్యలు. మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రానికి 430 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను చేరవేస్తున్నాం. రెమ్‌డెసివర్‌ పర్యవేక్షణ నోడల్‌ అధికారిగా ప్రీతి మీనాను నియమించాం.