సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (09:55 IST)

మండిపోతున్న టమోటా ధరలు - కేజీ రూ.100

Tomato
తెలంగాణా రాష్ట్రంలో టమోటా ధరలు మండిపోతున్నాయి. ఈ రాష్ట్రంలోని మంచిర్యాల మార్కెట్‌లో కేజీ టమోటాల ధర రూ.100గా పలుకుతోంది. మార్చిలో కిలో టమోటా ధర రూ.20 నుంచి రూ.30గా ఉండగా ప్రస్తుతం వీటి ధరలు మరింతగా పెరిగాయి. 
 
కాగా, ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు, చికెన్, మటన్ రేట్లు కూడా భారీగా పంచేశారు. తాజాగా టమోటా ధర కూడా భారీగా పెరిగింది. పలు మార్కెట్లలో టమోటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూరగాయల మార్కెట్లలో టమోటా సెంచరీ కొట్టింది. 
 
మంచిర్యాల మార్కెట్‌లో సోమవారం కిలో టమోటాల ధర రూ.100 పలుకగా, మార్చిలో కిలో టమోటాల ధర రూ.20 నుంచి రూ.30గా వుంది. ఇపుడు 20 కేజీల టమోటా బాక్సు ధర రూ.800 నుంచి రూ.1000 పలికింది. సోమవారం ఈ ధర రూ.1600గా వుంది.