శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (13:18 IST)

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖరారయ్యారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌.. గుత్తా అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో శనివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను గుత్తా కలిశారు.
 
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3,  తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్ వెలువరించింది. ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే, తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
 
ఇందుకు సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 14 వరకు గడువు విధించారు. ఈ నెల 16న నామినేషన్ల పరిశీలిన, ఆగస్టు 19న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆగస్టు 26న పోలింగ్ జరిపి.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలను వెల్లడిస్తారు.