తెలంగాణ పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు
తెలంగాణ పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు చేసింది. పరీక్షా నిర్వహించే సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
తాజాగా సవరించిన టైమింగ్స్ ప్రకారం.. ఈ ఏడాది నుంచి ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
ప్రశ్నాపత్రంలో ఎక్కువ ఛాయిస్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు పరీక్షా సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.