సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (13:24 IST)

రైల్వే శాఖలో ఉద్యోగాలు.. అర్హత టెన్త్ ఉత్తీర్ణత

railway bridge
భారతీయ రైల్వే శాఖలోని ఈస్ట్రన్ రైల్వే విభాగంలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా మొత్తం 2,972 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమై మే 10వ తేదీ వరకు కొనసాగుతోంది. దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సివుంటుంది. 
 
మొత్తం పోస్టుల్లో హౌరా డివిజన్‌లో 659, షిల్డా డివిజన్‌లో 297, కంచరపర డివిజన్‌లో 187, మాల్దా డివిజన్‌లో 138, అసన్సోల్ డివిజన్‌లో 412, జమాల్‌పూర్ డివిజన్‌లో 667, లిలుహ్ డివిజన్‌లో 612 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన విద్యార్హతను కలిగి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై వుండాలి. అలాగే దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు మాత్రం ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.