బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (14:24 IST)

డీఎస్‌యూలో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

న్యూఢిల్లీలోని ఢిల్లీ స్కిల్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ యూనివర్సిటీ (డీఎస్‌యూ)లో రెగ్యులర్‌ మరియు ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
 
భర్తీ చేయనున్న పోస్టుల్లో లెక్చరర్లు138 పోస్టులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 38 పోస్టులు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 23 పోస్టులు, ప్రొఫెసర్లు13 పోస్టులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ‌(ప్రాక్టీస్‌)13 పోస్టులు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (ప్రాక్టీస్‌)5 పోస్టులు , ప్రొఫెసర్లు (ప్రాక్టీస్‌) 3 పోస్టులు ఉన్నాయి.
 
ఇక ఎంపిక విధానానికి వస్తే ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 25, 2022గా నిర్ణయించారు.