తెలంగాణాలో ఇంటర్ పరీక్షా ఫలితాలపై క్లారిటీ
తెలంగాణ రాష్టంలో ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో ఈ ఫలితాల విడుదలకు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ ఫలితాలను సాధ్యమైనంత త్వరగా వెల్లడించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తుంది. ఈ కసరత్తు కూడా తుది దశకు చేరుకుంది.
ఇంటర్ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 31వ తేదీన జవాబు పత్రాల మూల్యాంకన పనులను ప్రారంభించింది. ఇందుకోసం వివిధ సబ్జెక్టులకు సంబంధించి 2,701 మంది ఉపాధ్యాయులను నియమించింది. వీరంతా సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో ఈ మూల్యాంకన పనులు ఈ నెల 21వ తేదీతో ముగిసింది.