గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (11:11 IST)

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కీలక ప్రకటన.. టీపీసీసీ చీఫ్ పదవికి..?

తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు హుజూర్ నగర్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు.
 
మున్సిపల్ ఎన్నికల తరువాత టీపీసీసీ చీఫ్ పదవి వదులుకుని హుజూర్ నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నట్టు చెప్పారు. తన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని తెలిపారు. 
 
మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.