మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (15:58 IST)

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. లోబరుచుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ..?

వికారాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం గుడ్డిరుక్య తాండాకు చెందిన వివాహిత మహిళ అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే కామాంధుడి చెరలో చిక్కిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు, విడియోలు తీసిన శ్రీనివాస్ మహిళను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 
 
మహిళను శారీరకంగా లోబర్చుకోవడమే కాక ఆ సమయంలో కూడా వీడియోలు తీసి వాటిని ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ పైశాచికానందం పొందడం మొదలుపెట్టాడు. అలా షేర్ అయిన వీడియోలు ఒకరి దగ్గరి నుండి మరొకరికి చేరి అలా అలా చేతులు మారుతూ మహిళ కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో బాదిత మహిళ భర్త కుల్కచర్ల పోలిసు స్టేషన్లో పిర్యాదు చేశారు. 
 
మా పైనే పోలీసులకు పిర్యాదు చేస్తారా అంటూ బాదితురాలి కుటుంబంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. బాధితురాలికి అండగా ఉండవలసిన ఎస్సై కూడా శ్రీనివాస్ కుటుంబానికి వత్తాసు పలుకుతూ తమపై కేసులు చేశాడని బాధితురాలి సోదరుడు ప్రకాశ్ ఆరోపిస్తున్నారు.