ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

మునిగే నావ ఎవరిదో తేలుస్తాం.. భట్టి

తెలంగాణ మంత్రి, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగేనావ అని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మునిగే నావ ఎవరిదో త్వరలోనే తెలుస్తామన్నారు.

రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళను లేకుండా చేసి ఇష్టారాజ్యంగా పాలించాలనుకుంటున్నారన్నారు. హుజూర్ నగర్లో సిపిఐ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారన్న భట్టి ఆరేళ్ళ మీ పాలనలో రాష్ట్రాన్ని దివాళాతీయించారని, కెసిఆర్ నాయకత్వాన్ని వదిలించుకోకపోతే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోక తప్పదన్నారు.

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతోనే సీపీఐతో టీఆర్‌ఎస్‌ కలిసిందన్నారు. సెక్రటేరియట్‌ కూల్చివేతపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఈ తీర్పుతో న్యాయస్థానాలపై ప్రజలకు గౌరవం పెరిగిందన్నారు.