గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

సీపీఐ, సీపీఎంలపై బీజేపీ ఆగ్రహం

సీపీఐకి నారాయణ చీడ పురుగని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. సీపీఐ, సీపీఎం సిద్ధాంతాలను అమ్ముకున్నాయని, వాటికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.

నామినేషన్స్ ముందు సీపీఐ.‌. నామినేషన్స్ తరువాత సీపీఎం టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది కాబట్టే సీపీఐ, సీపీఎంతో కాళ్ళ బేరానికొచ్చిందని ఆరోపించారు. కమ్యూనిస్టులను కేసీఆర్ ఏవిధంగా మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు.

ఉప ఎన్నికలు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మారాయని, ఎమ్మెల్సీ పదవి కోసం కమ్యూనిస్టులు ఆశపడ్తున్నారని అన్నారు. సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు రాజా, సీతారాం ఏచూరిలకు తాను లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్, త్రిపుర లానే వామపక్ష భావజాలం ఉన్నవారు బీజేపీకే ఓటు వేస్తారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.