సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (11:52 IST)

ఫ్లై-ఓవర్ పై నుంచి పడి మహిళ మృతి.. బైకులో వెళ్తుండగా..

car accident
హైదరాబాద్‌లో ఫ్లై-ఓవర్‌పై నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆమె స్నేహితుడు కూడా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే కోల్‌కతాకు చెందిన స్వీటీ పాండే (22), ఆమె స్నేహితుడు రియాన్ లూక్ గురువారం సాయంత్రం జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు వెళ్తున్నారు.  
 
అయితే హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తుండగా, అతివేగం కారణంగా ద్విచక్ర వాహనంపై రైడర్ అదుపు తప్పి రిటైనింగ్ వాల్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో స్వీటీ ఫ్లై ఓవర్‌పై నుంచి యువతి కింద రోడ్డుపై పడి తలకు గాయాలయ్యాయి.
 
రియాన్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
 
మాదాపూర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్  ఐపీసీ సెక్షన్ 337 మరియు 304 (A) కింద నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.