గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (11:07 IST)

అట్టహాసంగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం రెండో కుమారుడి వివాహం

Brahmanandam
Brahmanandam
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం రెండవ కుమారుడు సిద్ధార్థ్, శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజల కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అన్వయ కన్వెన్షన్స్‌లో ఆగస్టు 18, శుక్రవారం రాత్రి 10:45 గంటలకు ఈ వేడుక జరిగింది. 
 
ఈ వివాహానికి రాజకీయ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మోహన్ బాబు, శ్రీకాంత్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.