శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (10:00 IST)

అత్తింటి వేధింపులు.. మనస్తాపంతో పురుగుల మందు సేవించి..?

అత్తింటి వేధింపులకు ఓ యువతి బలైపోయింది. ఈ ఘటన జిల్లాలోని మోత్కూరు మండలం దత్తప్ప గూడెంలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతో నవిత(22) అనే యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన నవిత, పరశురాములు ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఎంగేజ్మెంట్ ముందు రోజే పరుషరాములుతో నవిత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆపై మార్చి4న ఆర్య సమాజ్‌లో ఇరువురు వివాహం చేసుకున్నారు. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ క్రమంలో వారిని మంచిగా చూసుకుంటామంటూ పరుశరాములు కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పి జంటను తీసుకెళ్లారు. అయితే గత కొద్దిరోజులుగా ఆదనపు కట్నం కోసం నవితను అత్తింటి వారు వేధింపులకు గురిచేశారు. 
 
రోజు రోజుకు వేధింపులు అధికమవడంతో తీవ్రమనస్తాపానికి గురైన నవిత రెండు రోజుల క్రితం పురుగుల మందు సేవించింది. పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవిత మృతి చెందింది. ఈ ఘటలనకు సంబంధించి 8 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వున్న అత్తింటివారిని గాలించే పనిలో పడ్డారు పోలీసులు