సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (13:20 IST)

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ అనుమానాస్పద మృతి

doctor
ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ శ్వేత అనుమానాస్పద మృతి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం రేపింది. గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత అనుమానాస్పదంగా మృతి చెందారు.  
 
వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత అనుమానాస్పదంగా మృతి చెందారు.
 
ట్రైనింగ్‌లో భాగంగా గురువారం రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు. రాత్రి రెండుగంటల వరకూ డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ శ్వేత ఆ తర్వాత తన గదికి వెళ్లి రెస్ట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ శ్వేత తెల్లవారుజామున చూసేప్పటికి ఆమె విగతజీవిగా కనిపించారు.
 
కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత గైనిక్ విభాగంలో పీజీ చేస్తూ నిజామాబాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. గురువారం (మే12, 2022) రెండు గంటల వరకూ ఆమె డ్యూటీలో ఉన్నారు. 
 
అనంతరం రెస్ట్ రూమ్‌లో పడుకున్నారు. ఉదయం చూసేసరికి ఆమె మృతి చెందారు. గుండెపోటుతో డాక్టర్ శ్వేత చనిపోయినట్లుగా తెలుస్తోంది. లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.