సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (08:34 IST)

పోస్టల్ ద్వారా యాదాద్రి ప్రసాదం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయశాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే స్వామిఅమ్మవార్ల ప్రసాదంతో పాటు అక్షితలు, కుంకుమను నేరుగా భక్తుల ఇంటికి చేర్చేలా నిర్ణయం తీసుకున్నారు.

స్పీడ్ పోస్టులో తపాలాశాఖ ఈ సేవలను భక్తులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు దేవాదాయశాఖ అధికారులు పోస్టల్శాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే భక్తులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఒక్క యాదాద్రిలోనే కాకుండా బాసర, భద్రాచలం, వేములవాడ సహా మరో 10 ఆలయాల నుంచి భక్తుల కోరుకున్న విధంగా ప్రసాదం, అక్షితలు, కుంకుమను స్పీడ్ పోస్టులో ఇంటికి పంపేలా తపాలా శాఖతో అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నారు.

ఇందుకోసం దేవాదాయ శాఖ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ సేవలను పొందేందుకు చెల్లింపులను నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ పద్ధతుల్లో స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ చెల్లింపులను పోస్టల్ శాఖ బరువు ఆధారంగా నిర్ణయించనుంది. ఈ సేవలు ఫిబ్రవరి నెలాఖరుకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.