గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (12:39 IST)

తమ్ముడు ఈటల... రాములమ్మ ట్వీట్

ఈటల రాజేందర్ బీజేపీ నేతలను కలవడం, దాదాపుగా బీజేపీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈటల నిర్ణయాన్ని అభినందించారు. రాష్ట్రంలో టీఆరెస్‌ను ఢీకొట్టే సత్తా బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.. 
 
అందులో ‘తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన నిర్ణయం దిశగా వెళుతున్నందుకు అభినందనలు. టీఆరెస్‌ను ఎదిరించి నిలిచి, గెలిచే సత్తా, సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉన్నాయనేది ఇయ్యాల తిరుగులేని వాస్తవం.
 
కాంగ్రెస్ నుండి గెలిపించిన ఎమ్మెల్యేలు టీఆరెస్‌కి వెళ్ళిపోతారనే భావం తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా నిరూపితమయ్యింది. ఉద్యమకారుల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల భవిష్యత్... రెండూ బీజేపీతోనే నిలబడతాయనేది స్పష్టమైన నిజం’ అని పేర్కొన్నారు.