యాక్షన్‌లో రామ్‌ చరణ్‌... లారీ కొక్కేనికి తగిలి ఈడ్చుకెళ్లే సీన్...

IVR| Last Modified సోమవారం, 23 జూన్ 2014 (16:48 IST)
గత కొద్దికాలం రెస్ట్‌ తీసుకుని మళ్ళీ సెట్‌పైకి వచ్చిన రామ్‌ చరణ్‌.. తాజాగా యాక్షన్‌ సన్నివేశాలతో పోరాడుతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం షూటింగ్‌ నానకనరామ్‌గూడాలో జరుగుతుంది. రామ్‌లక్ష్మణ్‌ ఫైట్‌మాస్టర్‌ సారథ్యంలో లారీని ఛేజ్‌ చేస్తుండగా దాని కొక్కేనికి తగిలి ఈడ్చుకుంటూ వెళ్లే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. కొన్నిచోట్ల ఎగిరి దూకే సన్నివేశాలు కూడా ఉన్నాయి.

చిన్నవాటికి తనే నేరుగా దూకేస్తున్నాడు. మిగిలిన వాటిని ఫైటర్లతో రామ్‌లక్ష్మణ్‌లు చేయిస్తున్నారు. విదేశాల నుంచి ఇండియాలోని తన తాత ఇంటికి వచ్చిన పాత్రను రామ్‌చరణ్‌ పోషిస్తున్నాడు. ఇంతకుముందు తాతగా తమిళ నటుడు రాజ్‌కిరణ్ చేశాడు. ఇప్పుడు అది ప్రకాష్‌రాజ్‌ చేస్తున్నాడు. రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి కొద్దిరోజులు విశ్రాంతి అనంతరం జూలై 4 నుంచి భారీ షెడ్యూల్‌ జరగనుంది. బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :