ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (10:26 IST)

అదో గుణపాఠం.. ముచ్చట్లకు దూరంగా ఉంటున్నా : శ్వేతాబసు ప్రసాద్

తన జీవితంలో జరిగిన ఆ ఘటన తనకు ఓ గుణపాఠంలాంటిదని నటి శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తాను ముచ్చట్లకు దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. ప్రస్తుతం హిందీ సీరియల్ 'చంద్ర నందిని'లో నటిస్తున్న శ్

తన జీవితంలో జరిగిన ఆ ఘటన తనకు ఓ గుణపాఠంలాంటిదని నటి శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తాను ముచ్చట్లకు దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. ప్రస్తుతం హిందీ సీరియల్ 'చంద్ర నందిని'లో నటిస్తున్న శ్వేతాబసు మీడియాతో ముచ్చటించింది.
 
సినిమా షూటింగ్ సమయంలో దొరికే ఖాళీ సమయాల్లో అందరి నటుల మాదిరిగా తాను ముచ్చట్లు పెట్టడం, సెల్ఫీలు దిగడం వంటివి చేయనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం షూటింగ్ గ్యాప్‌లో ఇతర నటులు ఎలా నటిస్తున్నారో చూస్తానని, లేకపోతే, పుస్తకాలు చదువుకుంటానని చెప్పింది. 
 
రోజు మొత్తంలో 16 గంటలపాటు మనం మెలకువగానే ఉంటాం కనుక, ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటానని తెలిపింది. ఇకపోతే.. తన జీవితంలో జరిగిన ఆ ఘటన.. ఓ మాయని మచ్చవంటిదన్నారు. దాని నుంచి తాను బయటపడినట్టు తెలిపింది.