మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (10:34 IST)

త్రిష అందానికి రహస్యం ఇవే...

trisha krishnan
యంగ్‌గా, అందంగా కనిపించడానికి త్రిష బ్యూటీ సీక్రెట్ గురించి చెప్పింది. త్రిష యవ్వనంగా, అందంగా కనిపించడానికి ప్రధాన కారణం ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలి. త్రిష తన ఆహారంలో ప్రతిరోజూ పోషకమైన ఆహారాన్ని తీసుకోవడంపై చాలా శ్రద్ధ చూపుతుంది. జంక్ ఫుడ్‌ను పూర్తిగా పక్కనెబెట్టేస్తుంది. 
 
ప్రతిరోజూ ఉదయం గ్రీన్ టీ లేదా నిమ్మరసం- పచ్చి అల్లం కలిపిన గోరువెచ్చని నీటిని తాగిన తర్వాత తన రోజును ప్రారంభిస్తుంది. 
 
విటమిన్ సి అధికంగా ఉన్న నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లను తన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తన చర్మంలో భారీ మెరుగుదల కనిపించిందని చెప్పింది. ఆమెకు ఓవర్ మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు. ఐ-లైనర్, లిప్ బామ్‌లను ఉపయోగించడాన్ని ఇష్టపడుతానని త్రిష తెలిపింది.