శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (12:17 IST)

మరో వివాదంలో చిక్కుకున్న ఆదిపురుష్.. ప్రీ-రిలీజ్‌తోనే రూ.600 కోట్ల లాభమా?

adipurush movie still
"ఆదిపురుష్" మరో వివాదంలో చిక్కుకొంది. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ తమ పోస్టర్ నుంచి కాపీ కొట్టారని వానర్ సేన స్టూడియో ఆరోపణలు గుప్పించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టూడియో రిలీజ్ చేసిన శివ యానిమేషన్ పోస్టర్‌ను కాపీ కొట్టి ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేసారని చెప్పుకొచ్చారు. 
 
ఇక పోస్టర్లు రెండు ఒకేలా ఉన్నాయి. ప్రభాస్ రాముడి అవతారంలో విల్లు ఎక్కుపెట్టి గాల్లో తేలుతూ ఉండే ఈ పోస్టర్.. అచ్చు గుద్దినట్లు వారు డిజైన్ చేసిన శివ పోస్టర్ లానే ఉంది. దీనిపై వానర్ సేన స్టూడియో అసహనం వ్యక్తం చేసింది. 
 
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా తెరకెక్కిస్తున్న మరొక పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్.. రామాయణ ఇతిహాస కథ ఆధారంగా 3D ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిగా బాలీవుడ్ స్టార్ ఓం రౌత్ వ్యవహరిస్తున్నారు. 
 
ఈ సినిమా టీజర్‌పై విమర్శలు రావడంతో సినిమా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ టీజర్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా.. ఈ సినిమా రిలీజ్‌కి ముందే కొన్ని వందల కోట్ల ప్రాఫిట్‌తో దూసుకుపోతోంది. 
ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందే లాభాల బాట పట్టింది. 
 
ప్రీ రిలీజ్ తోనే సుమారుగా రూ.600 కోట్ల లాభంతో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. డిజిటల్ రైట్స్ రూ.500 కోట్లకు అమ్ముడుపోగా, శాటిలైట్ రైట్స్ రూ.400 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.60 కోట్లు, ఇంటర్నేషనల్ రైట్స్ రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా చూసుకుంటే సినిమా రిలీజ్‌కి ముందే రూ. 1100 కోట్ల రికవరీతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం.