గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (12:24 IST)

బీ మ్యాజికల్.. హ్యాపీ బర్త్ డే సిద్ధూ.. అదితి రావు శుభాకాంక్షలు

Siddharth, Aditi Rao Hydari
Siddharth, Aditi Rao Hydari
సిద్ధార్థ్, అదితి రావు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించనప్పటికీ, ఇది రహస్యం కాదు. వారి సోషల్ మీడియా ప్రవర్తన కూడా ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమను నిర్ధారిస్తుంది. తాజాగా సిద్ధార్థ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలను అదితిరావ్ ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. 
 
ఈ సందర్భంగా విదేశాల్లో విహారయాత్రలో సరదాగా గడిపిన వీడియోను షేర్ చేసింది. వీడియోలో సిద్ధార్థ్ చిన్నపిల్లాడిలా యాక్టివ్‌గా కనిపించాడు. "హ్యాపీ బర్త్ డే మానికార్న్, ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి. అన్నీ రంగాల్లో రాణించాలి. బీ మ్యాజికల్, బీ యూ హ్యాపీయెస్ట్ సిద్దూ డే” అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
 
ఇకపోతే, అదితి రావు, సిద్ధార్థ్ తెలుగు సినిమా మహా సముద్రం సెట్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.