ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (13:35 IST)

ముద్దు, పడకగది సన్నివేశాలు సహజంగా తీస్తారు.. అంజలి

Anjali look
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ఫేమ్ అంజలి బోల్డ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, పడకగది సన్నివేశాలు సహజంగా తీస్తారని.. కథకు అవసరమైనప్పుడు కచ్చితంగా అందులో నటించాల్సి వుంటుందని.. కాదనలేమని చెప్పుకొచ్చింది. 
 
కానీ హీరోలతో ఆ తరహా సన్నివేశాలు నటించేటప్పుడు ఎలాంటి వారికైనా కాస్త ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే అలాంటి బోల్డ్ సీన్స్ షూట్ చేసేటప్పుడు చుట్టూ జనం, టెక్నీషియన్లు మిగతా నటీనటులు కూడా వుంటారు. 
 
వారందరూ తన గురించి లోపల ఏం మాట్లాడుకుంటారని భయం వుంటుంది. ఎందుకంటే.. ఇద్దరు ప్రేమికుల మధ్య కెమిస్ట్రీ చాలా భిన్నంగా వుంటుంది. హీరోలతో కిస్సింగ్ బెడ్ రూమ్ సన్నివేశాల్లో సహజంగా నటించాలని.. అందుకే కాస్త ఇబ్బందిగానే వుటుందని తెలిపింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
ఇకపోతే.. బాలకృష్ణ , వెంకటేష్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన అంజలి ముఖ్యంగా హోమ్లీ పాత్రలతో సౌందర్య లేని లోటు తీర్చింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో జరీనా పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది.