శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 5 ఆగస్టు 2020 (17:04 IST)

చరణ్ లిస్ట్‌లో మరో డైరెక్టర్, ఇంతకీ ఎవరా డైరెక్టర్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు కానీ.. చరణ్ మాత్రం ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఇంకా ఎనౌన్స్ చేయలేదు.
 
వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుముల... ఇలా కొంతమంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో డైరెక్టర్ పేరు తెర పైకి వచ్చింది. అది ఎవరంటే... తమిళ హీరో కార్తీతో ఖైదీ సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు లోకేష్ కనకరాజ్. ఈ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది.
 
అయితే... ఈ డైరెక్టర్‌ని రామ్ చరణ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేయమని చెప్పారట. దీనికి లోకేష్ కనకరాజ్ ఓకే అని చెప్పాడట. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ అదే పనిలో ఉన్నాడని.. త్వరలో చరణ్‌కి కథ చెప్పనున్నాడని.. కథ సెట్ అయితే.. చరణ్ - లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అంటున్నారు. మరి.. ఈ సినిమా కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.