టాలీవుడ్ దర్శకుడు తేజ‌కు కరోనా వైరస్ (Video)

Teja
ఠాగూర్| Last Updated: సోమవారం, 3 ఆగస్టు 2020 (19:11 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దర్శకుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇటీవలే అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి కరోనా బారినపడగా, తాజాగా డైరెక్టర్ తేజ కూడా కరోనా బాధితుల్లో ఒకరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగులో పాల్గొన్నారు. ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అందరికీ కరోనా నెగెటివ్ వచ్చింది. తేజ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే, తెరాస నేత, కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. లక్ష్మణ్ డ్రైవర్, ఇద్దరు గన్‌మన్లు, ఇంట్లోని పనివారికి కూడా కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. మొత్తం 8 మందికి కరోనా సోకినట్టు తేలింది.

ప్రస్తుతం నారదాసు కుటుంబం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, టీఆర్ఎస్‌కే చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా నిన్న కరోనా బారినపడ్డారు.


దీనిపై మరింత చదవండి :