1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (10:02 IST)

అప్సర రాణిని సరికొత్త కోణంలో చూడాలనుందా !

Apsara Rani latest
Apsara Rani latest
అప్సర రాణి అనగానే వర్మ సినిమాలో ఎక్స్ పోజింగ్ పాత్రే గుర్తుకు వస్తుంది. డేంజర్ సినిమాలో పక్కా లెస్ బియన్ గా నటించింది. గతంలో సన్నీ లియోన్ కూడా ఈ తరహా నీలి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెను కరెంట్ అనే సినిమాలో ఓ టీచర్ గా మంచు మనోజ్ సినిమాలో నటింపజేశాడు. బయట యువతను నిద్రపోనివ్వకుండా  చేసే పాత్రల్లో నటించే హీరోయిన్లను ఒక్కసారిగా పవిత్రమైన పాత్రలో చూడాలని కొందరికి వుంటుంది.

Rajarikam- Apsara Rani
Rajarikam- Apsara Rani
తాజాగా అప్సర రాణిని ఓ రాజరిక దర్పం వుట్టి పడే పాత్రలో ఫెరోషియస్ గా వుండేలా రాచరికం అనే సినిమాలో దర్శకుడు ప్లాన్ చేశాడు. అది త్వరలో విడుదలకాబోతుంది. ఇందులో ఆమె పాత్ర భయపెట్టేదిగా వుంటుందట.
 
Apsara Rani
Apsara Rani
దాన్ని బట్టి ఆమె అభిమానులు ఓ విభిన్నమైన పాత్రలో చూడాలనుందని ఇటీవలే ఓ వీరాభిమాని సింహంపై అమ్మవారిలా కూర్చున ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి అప్సర రాణి మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి పాత్ర వస్తే తప్పకుండా చేయడానికి సిద్ధమని సూచన చేసింది కూడా. 
 
ఈ ఫ్యాన్ మేడ్ AI చిత్రాలను అందుకుని.. భగవత్ గీత ‘నిజమైన ధర్మం ప్రతి ఇతర జీవి పట్ల దయ మరియు కరుణలో ఉంటుంది, ఎందుకంటే దేవుడు వాటిలో ప్రతి ఒక్కరిలో నివసిస్తున్నాడు. మీ అందరి నుండి నేను పొందుతున్న ప్రేమ నాకు చాలా ప్రత్యేకమైనది మరియు చాలా విలువైనది అంటూ రిప్లయి ఇచ్చింది.