గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (13:08 IST)

మలైకా అరోరా కడుపుతో వుందా? అర్జున్ కపూర్ ఫైర్

బాలీవుడ్ నటి మలైకా అరోరా అర్జున్ కపూర్‌తో ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతంఈ జంట సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 
 
బాలీవుడ్ నటి మలైకా అరోరా అర్జున్ కపూర్‌ జంట తన మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అందులో వాస్తవం లేదని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ వార్తలపై మలైకా ప్రియుడు అర్జున్ కపూర్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఈ వార్తలను పూర్తిగా ఖండించాడు.
 
ఇలాంటి వార్తలను ఎలా ప్రచారం చేస్తారో అర్థం కావట్లేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వదంతులను పట్టించుకోబోమని తెలిపాడు. " మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవడానికి ధైర్యం చేయవద్దు" అని మీడియాను హెచ్చరించాడు. 
 
మలైకా ప్రస్తుతం తన OTT అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది. ఈమె 'మూవింగ్ ఇన్ విత్ మలైకా' అనే రియాలిటీ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. మరోవైపు అర్జున్ కపూర్ ఇటీవల ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రంలో నటించారు.