శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (22:14 IST)

మళ్లీ తల్లి కాబోతున్న సింగర్ సునీత.. అభిమానులకు గుడ్ న్యూస్?!

sunitha
సింగర్ సునీత అభిమానులకు గుడ్ న్యూస్. టాలీవుడ్ బిజినెస్ మ్యాన్ మ్యాంగ్ రామ్‌ను వివాహం చేసుకున్న సునీత తల్లి కాబోతున్నట్లు వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రామ్‌కు కోట్లాది రూపాయల వ్యాపారాలు వున్నాయి. 
 
అయితే ఈ మధ్య వయస్సులో ఈ దంపతులు తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారని.. అందుకే సునీతకు రీకానలైజేషన్ సర్జరీ చేయించుకున్నారనే పుకార్లు వస్తున్నాయి. సునీత కూడా తల్లి కాబోతున్న సంగతిని విని ఫుల్ హ్యాపీ మ్యూడ్‌లో వుందని తెలుస్తోంది. 
 
కాగా సింగర్ సునీత రామ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకుముందు చిన్న వయస్సులోనే సునీతకు పెళ్లైంది. ఇద్దరు పిల్లల తల్లి కూడా. అయితే భర్తతో విబేధాల కారణంగా ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చాలా యేళ్ల పాటు అలా వుండిపోయారు. 
 
ఆపై రామ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన హాయిగా సంసార జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. పిల్లలను, భర్తను, కెరీర్‌ను బ్యాలెన్స్డ్‌గా తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సునీత మళ్లీ తల్లి కాబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి.