శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 7 జనవరి 2019 (18:35 IST)

వామ్మో... మోక్ష‌జ్ఞతో మొదటి సినిమానా? క్లారిటీ ఇచ్చిన బోయ‌పాటి

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినిమా రంగ ప్ర‌వేశం గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ... క్లారిటీ మాత్రం రావ‌డం లేదు. 2017లోనే బాల‌య్య మోక్ష‌జ్ఞ సినిమా వ‌చ్చే సంవ‌త్స‌రం ఉంటుంద‌న్నారు కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఆయన ఎనౌన్స్ చేయ‌లేదు. ఇదిలా ఉంటే... మోక్ష‌జ్ఞ తొలి చిత్రానికి బోయ‌పాటి ద‌ర్శ‌కుడు అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌లపై బోయ‌పాటి స్పందించారు.
 
ఇంత‌కీ బోయ‌పాటి స్పంద‌న ఏంటంటే... మోక్షజ్ఞ తొలి సినిమాకు నేను దర్శకత్వం వహిస్తానని వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ.. వాటిలో ఏమాత్రం నిజం లేదు. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి. అందుకే మోక్షజ్ఞతో తొలి సినిమా నేను చేయాలనుకోవడం లేదు. అతని మూడు లేదా నాలుగో సినిమా నేను చేస్తానని భావిస్తున్నాను అని బోయపాటి స్పష్టత ఇచ్చారు. మ‌రి.. మోక్ష‌జ్ఞ తొలి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఎవ‌రికి వ‌స్తుందో చూడాలి.