శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 మే 2021 (11:46 IST)

లైగర్ రిలీజ్‌కు ముందే.. కేజీఎఫ్ హీరోతో పూరీ జగన్నాథ్ సినిమా..?

డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ పనుల్లో బిజీగా వున్నాడు. లైగర్ ఇంకా రిలీజ్ కాకముందే.. మరో పాన్ ఇండియా మూవీ సెట్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో కేజీఎఫ్ స్టార్ యాష్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పూరీ జగన్నాథ్‌కి కన్నడలో మంచి పేరుంది. 
 
ఇడియట్ మూవీని ముందుగా అక్కడే తీసి.. బంపర్ హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్. తర్వాతనే ఇక్కడ రవితేజతో తీశాడు. అప్పటి నుంచే పూరీకి మంచి క్రేజ్ ఉంది. పూరీ ప్రతి సినిమాకి అక్కడ ఫ్యాన్స్ ఫుల్‌గా ఉంటారు. దీంతో పూరీతో సినిమా చేసేందుకు కేజీఎఫ్ హీరో యష్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాడట. 
 
అందుకే.. పూరీ మంచి స్టోరీతో వస్తే.. సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు యష్. మొదట్లో ఒక స్టోరీతో వినిపిస్తే.. కేజీఎఫ్ టూ తర్వాత చేద్దాం అన్నాడట యష్. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని టాక్ వస్తోంది.