గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (14:40 IST)

సాయి పల్లవి ఆ మాట అనేసరికి ఆమెతో నటించలేకపోయా: వరుణ్ తేజ్

Sai Pallavi-Varun Tej
వరుణ్ తేజ్-సాయిపల్లవి జంట పేర్లు చెప్పగానే మనకు ఫిదా చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో వారిద్దరి నటన సూపర్బ్. మళ్లీ వారి కాంబినేషన్లో చిత్రం వస్తే బాగుంటుందని మెగా అభిమానులతోపాటు సాయిపల్లవి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కానీ అది రూపుదిద్దుకోలేదు. వాస్తవానికి వరుణ్ తేజ్-సాయి పల్లవి ఇద్దరూ దీనికి కారణం అని తెలుస్తోంది.
 
అసలు విషయం ఏంటయా అంటే... ఆమధ్య ఇద్దరూ కలిసి నటించేందుకు గాను ఓ స్టోరీని విన్నారట. ఐతే ఆ స్టోరీ ఫిదాను మించి లేదనిపించిందట. దాంతో భవిష్యత్తులో ఫిదా చిత్రాన్ని మించిన స్టోరీ వస్తేనే ఇద్దరూ కలిసి నటించాలని నిర్ణయించుకున్నారట. ఈ కారణం వల్లనే వరుణ్ తేజ్-సాయి పల్లవి ఇద్దరూ ఫిదా చిత్రం తర్వాత కలిసి నటించలేకపోయారట.
 
వరుణ్ తేజ్ రాబోయే చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా నటించగా జంటగా మానుషి చిల్లర్ నటించింది.