సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మే 2021 (10:48 IST)

ఫరియా అబ్దుల్లాకు బంపర్ ఆఫర్...

జాతి రత్నాలు చిత్ర హీరోయిన్ ఫరిదా అబ్దుల్లాకు బంపర్ ఆఫర్ వరించింది. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ నిర్మించ‌గా, ఈ సినిమా సినీ ప్రేక్ష‌కుల‌నే కాదు సెల‌బ్రిటీస్‌ని సైతం ఆక‌ట్టుకుంది. ఇందులో హీరో న‌వీన్ పోలిశెట్టి, హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. 
 
ముఖ్యంగా ఫ‌రియా.. ప్ర‌భాస్ వంటి స్టార్‌ని సైతం త‌న బుట్టలో వేసుకుంది. తొలి సినిమాతోనే ఫ‌రియాకు మంచి హిట్ ద‌క్క‌డంతో ఫుల్ ఖుష్ అవుతుంది. ఫ‌రియా గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న ప‌లువురు నిర్మాత‌ల‌ను ఇంప్రెస్ చేయ‌గా, ఆమెకు ప‌లు సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. 
 
జాతి ర‌త్నాలు సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుండ‌గా, ఇందులో స్టార్ హీరో స‌ర‌స‌న ఫ‌రియా అబ్దుల్లా న‌టిస్తుంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సీక్వెల్‌ని డైరెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. 
 
త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. జాతి ర‌త్నాలు సీక్వెల్‌తో ఫ‌రియా కెరీర్ ఫుల్ స్వింగ్‌లోకి పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.