ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (08:59 IST)

నిర్మాతలకు సంస్కారం సభ్యత లేదు... వారితో పని చేయను: నటి వరలక్ష్మి

కోలీవుడ్ నిర్మాతల్లో పలువురికి సంస్కారం, సభ్యత తెలియదని తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి అన్నారు. అలాంటి నిర్మాతలు తీసే చిత్రాల్లో తాను నటించబోనని ధైర్యంగా తెగేసి చెప్పింది.

కోలీవుడ్ నిర్మాతల్లో పలువురికి సంస్కారం, సభ్యత తెలియదని తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి అన్నారు. అలాంటి నిర్మాతలు తీసే చిత్రాల్లో తాను నటించబోనని ధైర్యంగా తెగేసి చెప్పింది. 
 
గతంలో సినీ పరిశ్రమలో హీరోయిన్లపై లైంగిక వేధింపుల వ్యవహారంపై ఈమె ఘాటైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. తాజాగా, చిత్ర పరిశ్రమలోని పురుషాధిక్యతపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమిళంలో విజయం సాధించిన ‘అప్పా’ చిత్రాన్ని మలయాళంలో ‘ఆకాశ మిట్టాయ్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. సముద్రగని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఆమె అర్థాంతరంగా తప్పుకున్నారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ... "ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాను. ఈ నిర్మాతలతో పనిచేయడం నాకిష్టం లేదు. ఎందుకంటే సంస్కారం, సభ్యత లేనిచోట పనిచేయడం కష్టం. అయితే నా నిర్ణయాన్ని అర్థం చేసుకున్న సముద్రగని, జయంరాలకు కృతజ్ఞతలు. వారిద్దరితో భవిష్యత్తులో తప్పకుండా పనిచేస్తాను. ప్రస్తుతం నేను రెండు మలయాళ సినిమాల్లో నటిస్తున్నా" అని చెప్పింది. వరలక్ష్మి మాటలు ఇప్పుడు పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాయి.