ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (20:01 IST)

పుష్ప సినిమాలో హీరోయిన్స్ ఒకరా ఇద్దరా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో బన్నీ ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు అనే విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో పుష్పపై మరింత ఆసక్తి ఏర్పడింది. దీనికితోడు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తుండటంతో పుష్ప సినిమా అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాలో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది.
 
తాజాగా ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నివేథా థామస్ కూడా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని.. కథను మలుపు తిప్పేలా నివేథా క్యారెక్టర్ ఉంటుందని ప్రచారం జరిగింది. అసలు ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అని ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే.. ఇందులో రష్మిక తప్ప మరో హీరోయిన్ లేదని తెలిసింది. ఈ సినిమా కోసం బన్నీ రాయలసీమ స్లాంగ్ కూడా నేర్చుకున్నారు. 
 
ఇందులో బన్నీ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సంవత్సరంలోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా వలన షూటింగ్స్ అన్నీ ఆగిపోవడం తెలిసిందే. అందుచేత ఈ సినిమా ఈ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాదు. వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమచారం.