మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:00 IST)

బుల్లితెరయినా వెండితెర అయినా పడుకోవాల్సిందేనంటున్న నటి

రోహిణి అంటే చాలామందికి తెలియకపోవచ్చు గానీ బిగ్ బాస్ రోహిణి అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. బిగ్ బాస్ 3 ద్వారానే ఆమె బాగా హిట్ అయ్యారు. బిటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరేందుకు హైదరాబాద్ వచ్చారు రోహిణి. ఆ తరువాత ఇండస్ట్రీకి ఫిష్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. సీరియల్‌లో నటించేందుకు వెళ్ళగా అక్కడ డైరెక్టర్, నిర్మాత కమిట్మెంట్ అడిగారట. 
 
అంతే అక్కడి నుంచి తాను వచ్చేశానని చెబుతోంది రోహిణి. ఆ తరువాత మళ్ళీ మరొక ఆడిషన్‌కు వెళితే అక్కడ పడుకుంటావా అని ఓపెన్‌గా అడిగారట. దీంతో ఆమెకు ఏం చెప్పాలో తెలియక వచ్చేశారట. ఇలా ఎన్నోరకాల ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చాననీ, బిగ్ బాస్ 3 రోహిణిగా తనకు మంచి గుర్తింపే వచ్చిందని చెప్పింది.
 
కానీ కొత్తగా పరిశ్రమలోకి వచ్చేవారికి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ప్రతిఒక్కరు కమిట్మెంట్ అంటూ ఓపెన్‌గా అడిగేస్తుంటారు. నాలాంటి మృధుస్వభావులకైతే తట్టుకోవడం చాలా కష్టం. నేను మొదట్లో చాలా ఆలోచించాను. అస్సలు బుల్లితెర, వెండితెర ఏదీ వద్దని వెళ్ళిపోదామనుకున్నాను. కానీ ప్రస్తుతం అదంతా ఏమీ లేకుండా నిలదొక్కుకున్నాను. సంతోషంగా ఉన్నానని చెబుతోంది.